కాలేజ్ రోజుల్లోనే మ‌హేష్ బాబుకి త్రిష తెలుసా?..

కాలేజ్ రోజుల్లోనే మ‌హేష్ బాబుకి త్రిష తెలుసా?..

కాలేజ్ డేస్ నుండే మ‌హేష్ బాబుకి త్రిష ప‌రిచ‌య‌మా?.. ఏం చెప్పిందంటే..! హీరో మ‌హేష్ బాబు, త్రిష జోడీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వీరిద్దరు అతడు సినిమాలో న‌టించ‌గా, అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో వేస్తే చాలు చాలా ఇంట్రెస్ట్‌గా ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఒక రకంగా టీవీలో బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అతడు అనే అంటారు అందరూ. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బుల్లి తెరపై మాత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో త్రిష, మహేష్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బావ ప్రేమకోసం ఎదురుచూసే పల్లెటూరి అమ్మాయిగా త్రిష పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇక మ‌హేష్ బాబు కూడా కాస్త యాటిట్యూడ్ ప్ర‌ద‌ర్శిస్తూ సీరియ‌స్‌గా చాలా అద్భుతంగా న‌టించారు. వారిద్ద‌రి పాత్ర‌ల‌కి ప్రేక్ష‌కులు ఇట్టే క‌నెక్ట్ అయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుండి తెలుసు. మేము ఇద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాము. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో మేము యాక్టర్స్ అవుతామని ఊహించ‌లేదు. అప్పుడు హాయ్, బాయ్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉండేది అని త్రిష పేర్కొంది.

editor

Related Articles