హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా ‘బైసన్’. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న తమిళంలో విడుదల కాబోతుండగా.. తెలుగులో కూడా అక్టోబర్ 17న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా నుండి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కబడ్డీ ఆట నేపథ్యంలో రాబోతోంది. 1980ల నాటి గ్రామీణ తమిళనాడు వాతావరణంలో, కబడ్డీ ఆటగాడి జీవిత పోరాటం, అణగారిన వర్గాల కష్టాలు, సామాజిక వివక్షపై వారి తిరుగుబాటు వంటి అంశాలను దర్శకుడు మారి సెల్వరాజ్ తనదైన శైలిలో చూపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
- October 14, 2025
0
102
Less than a minute
You can share this post!
editor


