హేట‌ర్స్‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ధ‌నుష్‌..

హేట‌ర్స్‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ధ‌నుష్‌..

కోలీవుడ్ హీరో ధ‌నుష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్ చేరుకున్నారు. కెరీర్‌లో ఎన్నో ఒడి దుడుకులూ ఆయ‌న ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా తెర‌కెక్కించ‌గా, ఇందులో నాగార్జున, రష్మిక కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాని జూన్ 20న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడిన మాటలు, కొందరికి ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలానే శేఖర్ కమ్ముల ఇచ్చిన స్పీచ్, నాగార్జున మాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుక‌లో ధ‌నుష్ తన రాబోయే సినిమాలపై వస్తోన్న నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే ఖండించారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన రాబోయే సినిమాల‌ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. తన అభిమానులు తనపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయ‌గ‌ల‌రంటూ ధనుష్ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. తన సినిమా విడుదలకు నెల రోజులు ఉండగానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నార‌ని, అయినా ఏం చేయ‌లేర‌ని ధ‌నుష్ అన్నారు. మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసిన నా సినిమా విడుద‌ల ఆప‌లేరు.

editor

Related Articles