ప్రస్తుతం టాలీవుడ్ సినిమాగా VD12 నిలిచింది. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌ని రూల్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ సినిమా నుండి టైటిల్ టీజర్‌తో సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. VD12 టైటిల్ టీజర్‌ను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ టైటిల్ టీజర్‌కు వివిధ భాషల్లో వివిధ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇక తాజాగా తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ‘దేవర’ జూ.ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో హీరో విజయ్ దేవరకొండ కలిసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విజయ్ దేవరకొండ కోసం దేవర జూ.ఎన్టీఆర్ వచ్చాడంటూ అభిమానులు ఈ ఫొటోను నెట్టింట వైరల్‌గా పెట్టారు.

- February 11, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor