2 పెద్ద సినిమాలకు పోటీగా వ‌స్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’

2 పెద్ద సినిమాలకు పోటీగా వ‌స్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’

మహేశ్ బాబు మేనల్లుడు.. ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్‌ గల్లా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. జాంబిరెడ్డి, హ‌నుమాన్ చిత్రాల ఫేమ్ ప్ర‌శాంత్ వర్మ  ఈ సినిమాకి కథ సమకూరుస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్‌గా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను న‌వంబ‌ర్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుండి వ‌రుణ్ తేజ్ మ‌ట్కాతో పాటు కోలీవుడ్ నుంచి సూర్య కంగువ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. దీంతో రెండు పెద్ద సినిమాల మ‌ధ్య ఈ సినిమా విడుద‌ల కానుండటంతో మూవీపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే హ‌నుమాన్ వంటి హిట్ కొట్టిన త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌తో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

administrator

Related Articles