దీపిక పవర్ లుక్ వైరల్..?

దీపిక పవర్ లుక్ వైరల్..?

తాజాగా ముంబైలో జరిగిన హాలోవెన్ పార్టీకి సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో హాజరై అదరగొట్టారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు దీపికా ప‌దుకొణె, అలియా భ‌ట్ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపికా ప‌దుకొణె తాను న‌టించిన‌ యాక్షన్ సినిమా ‘సింగం అగైన్’ లోని తన పాత్ర లేడీ సింగం పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించ‌గా. ఖాకీ యూనిఫామ్, క్యాప్, బ్లాక్ షేడ్స్‌తో దీపిక చాలా శక్తివంతంగా, ఆకర్షణీయంగా కనిపించారు. తన సినిమాలోని లుక్‌నే హాలోవెన్ కాస్ట్యూమ్‌గా ఎంచుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇక అలియాభ‌ట్ టాంబ్ రైడ‌ర్‌లోని సాహసోపేతమైన హీరోయిన్ లారా క్రాఫ్ట్ అవతారంలో మెరిశారు. ఆమె నల్లటి షార్ట్స్, టి-షర్ట్, ఆమె ఐకానిక్ హెయిర్ స్టైల్ అయిన జడ, తొడల వద్ద హోల్‌స్టర్లు, చేతిలో గన్ ప్రాప్‌తో అచ్చం లారా క్రాఫ్ట్‌లా కనిపించి హైలెట్‌గా నిలిచారు.
ఇక దీపిక, అలియాతో పాటు ఇతర స్టార్స్ కూడా ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్‌తో పార్టీకి వచ్చి ఆకట్టుకున్నారు ఇందులో దీపిక భర్త, హీరో రణ్‌వీర్ సింగ్ ప్రముఖ మార్వెల్ పాత్ర స్పైడ‌ర్ మ్యాన్‌ కాస్ట్యూమ్‌లో తన మార్క్ ఎనర్జీని చూపించారు.

editor

Related Articles