కూతురిని ప‌రిచ‌యం చేసిన దీపికా ప‌దుకొణే..

కూతురిని ప‌రిచ‌యం చేసిన దీపికా ప‌దుకొణే..

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె – రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు వీరి పాపకు “దువా” అని పేరుపెట్టుకున్నారు. అయితే ఇతర సెలబ్రిటీలలాగే వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ “నో ఫొటో పాలసీ”ని అనుసరిస్తూ వ‌చ్చారు. అంటే తమ కూతురి ముఖాన్ని మీడియా లేదా సోషల్‌ మీడియాలో బహిర్గతం చేయలేదు. ఓ సారి దీపికా తన పాప దువాతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించ‌గా, ఫొటోగ్రాఫర్లు వీడియో తీసేందుకు ప్రయత్నించగా, దీపిక వెంటనే గమనించి రికార్డింగ్ ఆపేయమని గట్టిగా చెప్పింది. పాప ముఖం కెమెరాలో పడకూడదనే ఉద్దేశంతో ఆమె అక్కడే వీడియో తీసిన వ్యక్తిపై కోపాన్ని ప్రదర్శించింది.
ఆ సమ‌యంలో చాలామంది దీపిక నిర్ణయాన్ని సమర్థించారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు దాన్ని గౌరవించాలి”, “ప్రతి పిల్లకి ప్రైవసీ హక్కు ఉంది” అంటూ కామెంట్లు పెట్టారు. సెలబ్రిటీ పిల్లలపైన ఫొటోగ్రాఫర్లు ఇలా ప్రవర్తించడం తప్పు అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ ర‌ణ్‌వీర్ సింగ్ , దీపికా పదుకొణెల‌ జంట దీపావ‌ళి వేడుకుల‌ను వైభ‌వంగా జ‌రుపుకున్నారు. కూతురు దువాతో క‌లిసి జ‌రుపుకోవ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేవు. ఈ సారి వారి ఇంట దివాళీ వేడుక‌లు మ‌రింత ప్ర‌త్యేకంగా మారాయి అనే చెప్పాలి.

editor

Related Articles