దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు

దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోయిన్ దీపికా పదుకొణె‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా  తీయబోతున్న ‘స్పిరిట్‌’ సినిమాలో హీరోయిన్‌గా దీపికను ముందుగా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆమెను తొలగించారు. ఆ తర్వాత తన సినిమాను లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సందీప్‌ రెడ్డి వంగా పెట్టిన ఓ పోస్ట్‌ చర్చకు దారితీస్తోంది. ఈ పోస్ట్‌ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం వేళ దీపికా పదుకొణె తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న దీపిక.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ తన నిర్ణయాలకు కట్టుబడి ఉండటం, దృఢంగా ముందుకు సాగడం గురించి మాట్లాడారు. ‘జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం అని భావిస్తా. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీపిక కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

editor

Related Articles