తమిళంలో హీరోయిన్‌గా మంచిపేరు తెచ్చుకుంది అమ్ము అభిరామి. రాక్షసన్, అసురన్ వంటి సినిమాల్లో ఆమె నటనతో మెప్పించింది. తాజాగా ఈ హీరోయిన్ రాజ్‌తరుణ్‌కి జోడీగా తెలుగులో అరంగేట్రం చేస్తోంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. సక్సెస్‌ఫుల్ గోలీసోడా ఫ్రాంచైజీలో భాగంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. అమ్ము అభిరామి పాత్ర భావోద్వేగభరితంగా సాగుతుంది. కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. తెలుగులో అమ్ము అభిరామికి బ్రేక్‌నిచ్చే సినిమా అవుతుంది అని దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు.
- June 17, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor

