‘కేజీఎఫ్’ ‘సలార్’ ‘కాంతార’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది హోంబలే ఫిల్మ్స్. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో పౌరాణిక సిరీస్ సినిమాల రూపకల్పనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందులో భాగంగా ‘మహావతార్ నరసింహా’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అశ్విన్ కుమార్ దర్శకుడు. జూలై 25న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా నుండి ‘రోర్ ఆఫ్ నరసింహ’ అనే పాటను విడుదల చేశారు. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో దశావతారాల్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ సినిమాల్ని రూపొందించబోతున్నామని హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. విష్ణుమూర్తి అవతారాలైన మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘనందన్ (2029), మహావతార్ ద్వారకాదీశ్ (2031), మహావతార్ గోకులనందన (2033), మహావతార్ కల్కి-1 (2035), మహావతార్ కల్కి-2 (2037) చిత్రాలను వరుస పెట్టి తీయడం జరుగుతుంది.
- June 26, 2025
0
195
Less than a minute
Tags:
You can share this post!
editor


