ధనుష్‌తో విశాల్ పోటీ.. యాక్టర్‌గా కాదు

ధనుష్‌తో విశాల్ పోటీ.. యాక్టర్‌గా కాదు

ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు విశాల్‌. తాజాగా విశాల్‌ ధనుష్‌తో పోటీ పడబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు విశాల్‌, ధనుష్‌. ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే ఎలా ఉంటుంది. ఈ వార్తే ఇప్పుడు నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. విశాల్‌ హీరోగా సరైన బ్రేక్ అందుకోక చాలా కాలమవుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు విశాల్‌. తాజాగా విశాల్‌ ధనుష్‌తో పోటీ పడబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
అయితే విశాల్‌ ఈసారి యాక్టర్‌గా కాకుండా డైరెక్టర్‌గా పోటీలో ఉండబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. విశాల్‌ హీరోగా నటిస్తున్న సినిమా మకుటం. మొదట ఈ సినిమాకి రవి అరసు డైరెక్టర్‌గా ఫైనల్ అయ్యాడు. మకుటం ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మకుటం సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు విశాల్‌. కొన్ని పరిస్థితుల వల్ల తాను దర్శకత్వ బాధ్యతల నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

editor

Related Articles