‘పుష్ప 2’ నుండి ‘ద‌మ్ముంటే ప‌ట్టుకోరా షెకావ‌త్’ సాంగ్ రిలీజ్‌

‘పుష్ప 2’ నుండి ‘ద‌మ్ముంటే ప‌ట్టుకోరా షెకావ‌త్’ సాంగ్ రిలీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా న‌టించింది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1,700 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమా నుండి ఫుల్ వీడియో సాంగ్‌ల‌ను ఒక్కొక్కటిగా వ‌దులుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ‘పుష్ప రాజ్’ సాంగ్‌తో పాటు ‘దెబ్బలు పడతాయ్‌ రో.. దెబదెబ్బలు పడతాయ్‌ రో.. కిస్ కిస్ కిస్సిక్‌’ సాంగ్‌ల‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం తాజాగా సినిమాలో ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ద‌మ్ముంటే ప‌ట్టుకోరా షెకావ‌త్.. ప‌ట్టుకుంటే వ‌దిలేస్తా సిండికేట్ అనే సాంగ్‌ను విడుద‌ల చేసింది. థియేట‌ర్‌లో ఉర్రూత‌లూగించిన ఈ సాంగ్‌ను మీరు కూడా చూడొచ్చు.

editor

Related Articles