అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా జులై 19, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, దొంగతనం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అడివి శేష్ గత సినిమాలకు భిన్నంగా మరింత ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. మృణాల్ ఠాకూర్‌తో ఆయన కెమిస్ట్రీ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే లవ్ ట్రాక్‌తో పాటు యాక్షన్, సస్పెన్స్ కూడా ఈ సినిమాకి బలంగా నిలిచాయి.
ఈ సినిమాకి శనీల్ డియో దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇది ఆయన తొలి సినిమా కాగా, సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందారు. స్టైలిష్ విజువల్స్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ‘డెకాయిట్’ టెలివిజన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఆదివారం ప్రైమ్ టైమ్‌లో ప్రసారం కానుండటంతో ఈ సినిమాకు మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని బుల్లితెర వర్గాలు భావిస్తున్నాయి.

