గురునానక్‌గా అమీర్ ఖాన్ పోస్ట‌ర్‌పై వివాదం..!

గురునానక్‌గా అమీర్ ఖాన్ పోస్ట‌ర్‌పై వివాదం..!

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. సిక్కు మ‌త‌స్థుల దైవం అయిన‌ గురునానక్ బ‌యోపిక్ చేస్తున్న‌ట్లు అత‌డి రూపంలో ఉన్న‌ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై అమీర్‌ఖాన్ టీమ్ స్పందించింది. ఆ పోస్టర్ పూర్తిగా నకిలీదని, అది కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించబడిన పోస్ట‌రని టీమ్ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై అమీర్ ఖాన్ టీం స్పందిస్తూ.. గురునానక్‌గా అమీర్ ఖాన్‌ను చూపిస్తున్న పోస్టర్ పూర్తిగా నకిలీది. దానిని AI ద్వారా తయారు చేశారు. అమీర్ ఖాన్‌కు అలాంటి ప్రాజెక్ట్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆయన గురునానక్‌ను ఎంతో గౌరవిస్తారు. ఈ పోస్టర్‌ను ఒక నకిలీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వ్యాప్తి చేయడంతో సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC)కి కూడా ఫిర్యాదు అందింది. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా ఉంద‌ని పోలీసుల‌కు ఇచ్చిన‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ మోసాన్ని వెంటనే బహిరంగంగా ఖండించాలని, తమకు దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది.

editor

Related Articles