డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుండి పోటీచేసే దమ్ముందా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. “చెన్నైలోని ఏ నియోజకవర్గం నుండైనా పోటీచేయండి. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలి. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధం” అని మంత్రి శేఖర్‌బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తమిళనాడు పర్యటనకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తోందని పవన్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శేఖర్‌బాబు స్పందిస్తూ ఈ సవాల్ విసిరారు.
- June 24, 2025
0
97
Less than a minute
Tags:
You can share this post!
editor


