కామెడీ ట్రాక్‌ సినిమా ‘బ్యాడ్‌గాళ్స్‌’

కామెడీ ట్రాక్‌ సినిమా ‘బ్యాడ్‌గాళ్స్‌’

అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌గాళ్స్‌’. ‘కానీ చాలా మంచోళ్లు’ ఉపశీర్షిక. రోహన్‌ సూర్య, మెయిన్‌ రోల్స్ పోషిస్తున్నారు. మున్నా ధూలిపూడి దర్శకుడు. ఈ సినిమాలో ‘ఇలా చూసుకుంటావే..’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. చంద్రబోస్‌ సాహిత్యాన్నందించిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్‌ ఆలపించారు. అనూప్‌రూబెన్స్‌ స్వరకర్త. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని, పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో మహిళలు స్వీయరక్షణను పెంచుకుని ధైర్యంగా బతకాలనే అంశాన్ని చూపెడుతున్నామని, సందేశాత్మక కథ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాకి నిర్మాతలు: శశిధర్‌ నల్లా మరి కొందరు.

editor

Related Articles