సరిపోదా శనివారం సినిమా సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు హీరో నాని. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ది ప్యారడైజ్ టైటిల్ లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. త్వరలోనే నాని సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడు. కాగా ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడట. అంతేకాదు మరో పాపులర్ తెలుగు యాక్టర్ కీ రోల్‌లో నటిస్తున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఇంతకీ ఎవరా నటుడనేది ప్రస్తుతానికి ఇంకా బయటపడలేదు. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై మోహన్ బాబు-నాని పోరు ఎలా ఉండబోతున్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హై ఎనర్జిటిక్ యాక్షన్ ప్యాక్‌డ్ రోల్‌లో కనిపించబోతున్నాడట.
- November 28, 2024
0
103
Less than a minute
You can share this post!
editor

