సాక్షి అగర్వాల్ కొత్త బిజినెస్

సాక్షి అగర్వాల్ కొత్త బిజినెస్

దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘ఓకు (OKU)’ పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించి తన చిరకాల కలను సాకారం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ, గత ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం పరిశోధనలు నిర్వహించి, ఉత్పత్తుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ నాణ్యత కలిగిన పోషకాహార ఉత్పత్తులను అందించడమే తన లక్ష్యమని సాక్షి చెప్పారు. ప్రతి ఉత్పత్తిని నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా రూపొందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక న్యూట్రిషన్ బ్రాండ్లకు సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నప్పటికీ, తాను స్థాపించిన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు.

సినిమా షూటింగ్‌లతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఈ సంస్థను నిర్మించానని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే నమ్మకమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలనేదే తన ఉద్దేశమని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా కలగన్న స్వప్నం నేడు నిజమైందని, ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి అగర్వాల్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’, ‘సిండ్రెల్లా’, ‘టెడ్డి’, ‘అరణ్మనై 3’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే ‘బిగ్‌బాస్ తమిళ్’ రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. నటిగా విజయవంతమైన సాక్షి ఇప్పుడు వ్యాపారవేత్తగా కూడా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించగా, సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles