‘లెనిన్’తో పాటు 7 కొత్త చిత్రాలు

‘లెనిన్’తో పాటు 7 కొత్త చిత్రాలు

ఈ నెల రెండో శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి నెలకొననుంది. తెలుగు నుంచి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలవుతుండగా, పలు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

లెనిన్: మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో అఖిల్ అక్కినేని రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. నాగార్జున అక్కినేని, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

వాసుదేవ సుతం: పూరీ జగన్నాథ ఆలయం నేపథ్యంలో సాగే మైథాలజికల్ యాక్షన్ డ్రామా. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటించగా, వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు.

ఐ నోబడీ: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు నటించిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్. భారీ బ్యాంక్ దోపిడీ కేసులో ఇరుక్కున్న వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడన్న కథతో తెరకెక్కింది.

లవ్ ఓ లవ్: తమిళ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో పవిష్ నారాయణన్, నాగ దుర్గ ప్రధాన పాత్రలు పోషించారు.

హృదయం మురళి: ప్రేమ, బ్రేకప్, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అథర్వ మురళి, ప్రీతి ముకుందన్ జంటగా నటించారు.

ఈవిల్ డెడ్ బర్న్: సామ్ రైమి నిర్మించిన ఈ హర్రర్ సినిమా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.

ధమాల్ 4: అజయ్ దేవ్‌గణ్‌, రితీష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధమైంది.

మోనా: డిస్నీ లైవ్ -యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘మోనా’ కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, హాలీవుడ్ సినిమాలతో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది.

Related Articles