టెక్నాలజీతో ముప్పు కూడా ఉంది: చిరంజీవి

టెక్నాలజీతో ముప్పు కూడా ఉంది: చిరంజీవి

పెరుగుతున్న టెక్నాలజీని మంచి కోసం, అభివృద్ధి కోసం ఉపయోగించాలని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. తెలంగాణ పోలీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్‌ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. దేశాన్ని ఏకం చేసి మనకు అందించిన సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి డీప్‌ ఫేక్‌ వీడియోల గురించి మాట్లాడారు. ప్రజలకు, సెలబ్రిటీలకు ఇదొక తలనొప్పిగా మారిందని సైబర్‌ నేరాలపై స్పందించారు. ‘పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలి. దానివల్ల ముప్పు కూడా ఉంది. అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణాలో పోలీస్‌ వ్యవస్థ బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. డీప్‌ ఫేక్‌ వీడియోల అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ, సీపీ సజ్జనార్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరూ డీప్‌ ఫేక్‌, సైబర్‌ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. వీటి నుండి సామాన్యులకు కూడా రక్షణ కల్పిస్తారు. దీనిపై ఒక చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. అది జరగాలని కోరుకుంటున్నా అని చిరంజీవి అన్నారు.

editor

Related Articles