చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై కేసు నమోదు..

చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై కేసు నమోదు..

ప్రపంచం రోజురోజుకీ సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపిస్తోంది. అయితే ఈ ఆధునిక సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ, డీప్‌ఫేక్‌ వీడియోల రూపంలో అశ్లీలత, తప్పుడు ప్రచారానికి వేదికగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ డీప్‌ఫేక్ బారిన సినీ మెగాస్టార్ చిరంజీవి కూడా పడటం కలకలం రేపుతోంది. తాజాగా దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్‌ అయ్యాయి. ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును కూడా ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి – “డీప్‌ఫేక్‌ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం చాలా ఘోరమైన విషయం. నా పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించి పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ పోలీసులను కోరారు.

editor

Related Articles