వరుణ్ తేజ్ ఇటీవల తన కజిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో తన రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు. తన పెదనాన్న చిరంజీవి గారు ఇంట్లో తప్పనిసరిగా ఆదివారం నాడు అందరూ కలిసేలాగా, కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చూసే ముఖ్యమైన పాత్ర పోషించారని హీరో వరుణ్ వెల్లడించారు, ఇది ఏళ్లతరబడిగా వస్తున్న ఆచారంగా, కుటుంబం సన్నిహితంగా ఉండడానికి సహాయపడింది. “చిరంజీవి గారు మమ్మల్ని ఎప్పుడూ ఆకతాయిలుగా మారనివ్వలేదు. మమ్మల్ని అణకువగా పెంచడంలో ఆయనది గొప్ప పాత్రే ఉంది. అతను ఎల్లప్పుడూ మమ్మల్ని అదుపులో పెడదామని చూశారు. ఆయన హెడ్‌మాస్టర్ లాంటివారు. ఆయన ఏం చెప్పినా వింటాం. అతను మొత్తం కుటుంబానికి మార్గదర్శిగా ఉన్నారు. అతను సిద్ధార్థ్ కన్నన్‌తో చాట్‌లో ఆ విషయాలు చెప్పారు. వరుణ్ తేజ్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కొడుకు. అతను బహుశా మా ముగ్గురినీ (వరుణ్‌తేజ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్)లను మూడు వేర్వేరు సందర్భాలలో కొట్టి ఉండవచ్చు, అదే మంత పెద్ద తప్పుకాదు, కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు, కానీ మేము ఎల్లప్పుడూ అతని మాట వింటాము.

- November 7, 2024
0
25
Less than a minute
Tags:
You can share this post!
administrator