చిరు సినిమాలో వెంకీ పాత్ర ఏమిటో..?

చిరు సినిమాలో వెంకీ పాత్ర ఏమిటో..?

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో భారీ ఎంటర్‌టైనర్ రానున్నదనే వార్తతో టాలీవుడ్‌ అభిమానుల్లో జోష్‌ మొదలైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపించబోతున్న సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు”. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా కూడా మారింది. ఈ సినిమాకి హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పాజిటివ్ ఎనర్జీతో నిండిన కథలను చెప్పడంలో దిట్ట అయిన ఆయన, ఈసారి చిరంజీవి – వెంకటేష్‌ల కలయికను మరింత స్పెషల్‌గా మలచబోతున్నారని సమాచారం.
ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం, వెంకటేష్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే అది సాధారణ పాత్ర కాదు. ఆయన పాత్రలో వినోదంతో పాటు కథను కీలక మలుపు తిప్పే ఎమోషనల్ ఎడ్జ్ కూడా ఉంటుందట.

editor

Related Articles