హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కాగానే ఓజీ సెట్‌లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు కూడా గుమ్మడికాయ కొట్టేయనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25’ అని సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్‌రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించి సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు తమ్ముడికి కాబోయే కోడలు నటి సిరి లేళ్ళ ఇందులో ముఖ్య పాత్ర చేయనుందట. త్వరలో నారా రోహిత్‌ని వివాహం చేసుకొని నారా కోడలిగా వెళ్లనున్న సిరి గతంలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి అప్పటినుండి నారా రోహిత్, సిరి డేటింగ్ చేయసాగారు. అలా రీసెంట్ గానే వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.
- May 28, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor

