హీరో అక్కినేని నాగ చైతన్య బర్త్ డే ఈ రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ అలాగే తన అభిమానులు తనకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక దీంతో పాటుగా తన సినిమాల నుండి అప్‌డేట్స్ కూడా వస్తుండగా ఈ క్రమంలోనే తన నెక్స్ట్ భారీ సినిమాపై ఇప్పుడు అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే తన నెక్స్ట్ సినిమాగా తన కెరీర్ 24వ చిత్రాన్ని యంగ్ దర్శకుడు “విరూపాక్ష” ఫేమ్ కార్తీక్ దండుతో మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేశారు. మరి అది ఆవు కన్నులా కనిపిస్తుండగా అందులో నాగ చైతన్య ఒక జలపాతం ముందు నిలబడి కనిపిస్తున్నాడు. దీంతో ఇదేదో ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌లా ఉండేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి కూడా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా సుకుమార్ అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్‌లు నిర్మాణం వహిస్తున్నారు.
- November 23, 2024
0
135
Less than a minute
You can share this post!
editor


