Movie Muzz

మహావతార్‌ నరసింహ సినిమాని చూసిన చాగంటి కోటేశ్వరరావు..

మహావతార్‌ నరసింహ సినిమాని చూసిన చాగంటి కోటేశ్వరరావు..

 ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోలు లేని సినిమా ఎప్పుడూ కష్టంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సినిమా తలక్రిందులు చేసింది. కన్నడలో నిర్మితమైన ఈ యానిమేటెడ్ సినిమా, తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై విపరీతమైన క్రేజ్ సంపాదించింది. కేవ‌లం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతదేశంలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా ఘనత సాధించింది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతుండటం విశేషం. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను వీక్షించారు. ఆగస్ట్  15 నాడు అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్‌లో ఈ సినిమాను చూశారు. అనంతరం ఆయన సినిమా గురించి స్పందిస్తూ.. “మన పురాణాలకు చాలాదగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు గానీ… ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. చివరి సన్నివేశం అత్యంత అద్భుతంగా ఉంది. ఇది ప్రతి కుటుంబం థియేటర్‌లో చూసే సినిమా అని ప్రశంసించారు.

administrator

Related Articles