ప్ర‌భాస్ ‘రాజా సాబ్’లో గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్ న్యూ లుక్

ప్ర‌భాస్ ‘రాజా సాబ్’లో గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్ న్యూ లుక్

ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా సినిమాలలో ఒక‌టి రాజా సాబ్. భలే భ‌లే మొగాడివోయ్ ఫేమ్ మారుతి డైరెక్షన్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌గా.. పీపుల్స్ మీడియా బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుండి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుండి క్రేజీ అప్‌డేట్ ఉంటుందని చిత్ర‌బృందం ఎనౌన్స్ చేసింది. మూవీ నుండి ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు.. లోప‌ల‌ టీ షర్ట్‌తో అదిరిపోయే న్యూ లుక్‌లో ఉన్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

administrator

Related Articles