మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుందన్‌పై కేసు న‌మోదు.!

మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుందన్‌పై కేసు న‌మోదు.!

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఉన్ని ముకుందన్ త‌న‌పై దాడి చేశాడంటూ.. అత‌డి మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. విపిన్ కుమార్ ఇచ్చిన‌ ఫిర్యాదు ప్రకారం, తాను టొవినో థామస్ నటించిన తాజా చిత్రం ‘నరివెట్టా’ గురించి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడంతో ఉన్ని ముకుందన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసిందని సమాచారం. ఉన్ని ముకుందన్ తనను తన ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాకు పిలిపించి, తీవ్రమైన పదజాలంతో దూషించాడని, ఆ తర్వాత తనపై దాడి చేశాడని విపిన్‌ ఆరోపించాడు. గాయపడిన విపిన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను ఆరు ఏళ్లుగా ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్‌గా పనిచేశానని, ప్రస్తుతం పరిశ్రమలో 18 ఏళ్లుగా ఉన్నానని విపిన్ పేర్కొన్నాడు.

editor

Related Articles