సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం మీకు తెలుసు. ఈ కేసుకు సంబంధించి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపగా.. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యాడు. అల్లు అర్జున్‌తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్‌కు వెళ్లారు. ఇదిలావుంటే తాజాగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది. ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదే. ఈ తొక్కిసలాట ఘటనలో ఆ నటుడి పాత్ర ఎంతవరకు ఉంది.. లేదా పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది. ఈ కోణంలో చూడటం మానేసి.. ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం కావాలని సెన్సేషన్ చేస్తుంది. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు నా విన్నపం. కోర్టు ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తిపైనా ప్రతీకారం తీర్చుకోకూడదు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.

- December 24, 2024
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor