బన్నీ అంటే ప్రేమ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు..!

బన్నీ అంటే ప్రేమ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు..!

నటించిన సినిమాలు త‌క్కువే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రౌడీ హీరో కెరియ‌ర్‌లో హిట్స్ త‌క్కువే అయినా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. విజ‌య్‌కి అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. గీతా ఆర్ట్స్‌లో విజయ్ గీతగోవిందం సినిమా చేశాక.. టాక్సీవాలా అంటూ ఎస్ కే ఎన్‌తో పనిచేశాడు. అలా బన్నీ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యాడు. పలు సందర్భాల్లో ఇద్ద‌రు హీరోలు కూడా ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చూపించుకోవ‌డం మ‌నం చూశాం. రౌడీ బ్రాండ్ దుస్తుల్ని బన్నీకి ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాడు విజయ్ దేవరకొండ. తాజాగా అలానే తన కొత్త డిజైన్లను బన్నీకి పంపించాడు. రౌడీ బ్రాండ్‌కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో, రౌడీ వేర్స్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. రౌడీ బ్రాండ్స్‌కి సంబంధించిన ఏదైన కొత్త డిజైన్స్ వ‌స్తే వెంట‌నే వాటిని అల్లు అర్జున్‌కి పంపిస్తారు విజ‌య్ దేవ‌రకొండ‌. ఈ క్ర‌మంలోనే తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అల్లు అర్జున్‌కు రౌడీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్సులు పంపించారు. బ‌న్నీ పిల్లల కోసం బర్గర్లు కూడా గిఫ్ట్‌గా పంపించారు. విజ‌య్ గిఫ్ట్‌లు చూసి బ‌న్నీ తెగ ఫిదా అయిపోయాడు. ల‌వ్ యూ బ్ర‌దర్.. నీ ప్రేమకు థాంక్యూ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. దీనికి విజయ్ కూడా స్పందిస్తూ.. లవ్ యూ అన్నా.. మన రిలేష‌న్ ఇలానే కొనసాగాలంటూ ఎంతో ప్రేమతో చెప్పారు.

editor

Related Articles