రీసెంట్‌గా ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి డిప్రెషన్ కారణమంటూ నెట్టింట పలు వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ముకుల్ సోదరుడు రాహుల్ దేవ్ స్పందించారు. కొంత కాలంగా సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ముకుల్ చనిపోడానికి కారణమని అన్నాడు. ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్ దేవ్.. ముకుల్ వారం రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందాడు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత పూర్తిగా తినడం మానేశాడు. అదీకాక కొంతకాలంగా తీవ్రమైన ఒంటరితనంతో కూడా బాధపడుతున్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, వాటిని కూడా తిరస్కరించాడు. 2019లో తమ తండ్రి మరణం ముకుల్‌ను తీవ్రంగా కుంగదీసిందని రాహుల్ దేవ్ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత తల్లి మరణం, భార్యతో విడాకులు వంటి వరుస ఘటనలు ముకుల్‌ని ఒంటరిని చేశాయని చెప్పుకొచ్చాడు రాహుల్ దేవ్. అయితే ఈ పరిస్థితుల వల్లనే ముకుల్ ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడు. అలవాట్లు కూడా మారిపోయాయి. అతనికి అండగా నిలిచేవారు లేరు, పట్టించుకునేవారు కరువయ్యారు. ముకుల్ మృతిపై ఇప్పడు పలువురు రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదని రాహుల్ వివరణ ఇచ్చాడు.
- June 17, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor

