ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం.. : సమంత

ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం.. : సమంత

స్టార్‌ నటి సమంత  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతోపాటూ అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ఫ్యాషన్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్‌.. సినిమాలు చేయడాన్ని కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఏడాది గ్యాప్‌ తీసుకున్న ఈ స్టార్‌ నటి సమంత.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయినప్పటికీ గతంతో పోలిస్తే చాలాతక్కువ సినిమాలకు మాత్రమే సైన్‌ చేసింది. అందుకు గల కారణాన్ని సామ్‌ తాజాగా వెల్లడించింది. గ్రాజియా ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ‘ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత మంచి సినిమాలు తీశామనేది ముఖ్యం. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. గతంతో పోలిస్తే నాలో చాలామార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు, సిరీస్‌లు గుర్తింపు కోసమో, సక్సెస్‌ కోసమో చేసేవి కావు. అవన్నీ నా మనసుకు దగ్గరగా ఉన్నవి. ఇప్పుడు వర్క్‌ ప్లానింగ్‌లో మార్పు చేసుకున్నాను. ఫిట్‌నెస్‌, సినిమాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాను. నా శరీరం చెప్పేది వినడం నేర్చుకున్నా. అందుకే ఇకపై తక్కువ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను.

editor

Related Articles