సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన “బోర్డర్ 2” ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు కొన్ని షోలు రద్దు అయినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం అద్భుతమైన జోరు చూపించింది. రిపబ్లిక్ డే వీకెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఇండియాలోనే రూ.180 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టగా, గ్రాస్ కలెక్షన్లు రూ.212 కోట్లకు చేరాయి. ముఖ్యంగా జనవరి 26 సెలవుదినం కలెక్షన్లను భారీగా పెంచింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా దూసుకుపోతూ 4.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే వేగం కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- January 27, 2026
0
87
Less than a minute
You can share this post!
editor


