పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. అది ఏమీ తప్పు కాదు..

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. అది ఏమీ తప్పు కాదు..

బాలీవుడ్‌లో కొంద‌రు నటీమణులు పెళ్లికి ముందే గర్భం దాల్చిన విష‌యం తెలిసిందే. అలాంటి వారి జాబితాలో నేహా ధూపియా పేరు కూడా ఉంది. నేహా, నటుడు అంగద్ బేడీతో ప్రేమలో ఉన్న సమయంలోనే గర్భవతిగా మారారు. దీంతోవారు వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలలకే నేహా ధూపియా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని నేహా అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురౌతూనే ఉన్నారు. ఈ అమ్మ‌డి పెళ్లి జ‌రిగి చాలాఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ పెళ్లికి ముందు గర్భం దాల్చిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న‌ నేహా ధూపియా ఈ విమర్శలపై స్పందించారు. “అవును, నిజమే. నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యాను. కానీ అది ఏమీ తప్పు కాదు అని నా అభిప్రాయం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది నేనొక్కదాన్నే కాదు. అలియా భట్, నీనా గుప్తా లాంటి పలువురు నటీమణులు కూడా ఇదే దశను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ నెటిజన్లు ఎక్కువగా నన్నే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు,” అని అన్నారు. “అంగద్‌తో డేటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది కాలానికే నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి కాకముందే గర్భం దాల్చటం కొంద‌రికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సంప్రదాయ కుటుంబం అయిన‌, సంప్ర‌దాయేత‌ర కుటుంబం అయిన ఈ విష‌యం చెప్ప‌డం కాస్త ఇబ్బందే.
అప్పటి సిచ్యుయేషన్ నాకు మానసికంగా చాలా కష్టంగా అనిపించింది,” అని ఆమె చెప్పుకొచ్చారు.

editor

Related Articles