అక్కినేని హీరోలలో ఒకరైన నాగ చైతన్య రీసెంట్‌గా “తండేల్” సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు కలయికలో చేస్తున్న సంగతి తెలిసిందే. చైతు కెరీర్‌లో 24వ సినిమా కాగా దీని తర్వాత తన కెరీర్ ల్యాండ్ మార్క్ 25వ సినిమా పట్ల లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం చైతు కోసం తన బ్లాక్ బస్టర్ దర్శకుడు వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది. మజిలీ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ చైతు 25వ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయనున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక కార్తీక్ వర్మ దండు ప్రాజెక్ట్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు.

- June 24, 2025
0
91
Less than a minute
Tags:
You can share this post!
editor