సిరాజ్‌తో డేటింగ్‌పై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ

సిరాజ్‌తో డేటింగ్‌పై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ

ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ మొహమ్మద్ సిరాజ్‌తో బిగ్ బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మ డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించింది న‌టి మ‌హిరా. ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్‌లు, బాలీవుడ్ హీరోయిన్‌ల మ‌ధ్య డేటింగ్ వార్త‌లు రావ‌డం స‌హ‌జ‌మే అన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు క్రీడా ప్ర‌ముఖులు సినీన‌టుల మ‌ధ్య వార్త‌లు రాగా.. అందులో కొన్ని నిజం కూడా అయ్యాయి. అయితే తాజాగా స్టార్ క్రికెట‌ర్ మొహమ్మద్ సిరాజ్‌తో బిగ్‌బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మ డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. దీనికి ముఖ్య కార‌ణం సిరాజ్‌, మ‌హిరాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వ‌డ‌మే. అయితే ఈ ఫాలోయింగ్ లైక్‌ల వ‌ర‌కు వెళ్ల‌డంతో వీరిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారా అని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై తాజాగా స్పందించింది మహిరా శర్మ. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరినీ డేట్ చేయడం లేదు. సిరాజ్‌తో డేటింగ్ అంటూ వ‌స్తున్న‌ వార్తలు నిజం కావు. పబ్లిక్ ఫిగర్‌గా ఇలాంటి పుకార్లను ఎదుర్కోవడం సర్వసాధారణం. అభిమానులు తమకు నచ్చిన విధంగా ఎవ‌రితోనైనా లింక్‌లు పెడతారు. ఇంత‌కుముందు బిగ్ బాస్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటివి జ‌రిగాయంటూ మ‌హిరా చెప్పుకొచ్చింది.

editor

Related Articles