ఎపిసోడ్ మొదట్లో కంటెస్టెంట్ల గాసిప్ లతో మొదలైంది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్ లో చర్చనీయాంశమైంది. “నా కోసం ఎవరూ ఏడవలేదు” అని అతను చెప్పడం ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మరోవైపు రీతూ చౌదరీ కూడా భావోద్వేగానికి లోనై ఏడుస్తూ కనిపించింది. ఇక హౌస్ ఓనర్ కోసం బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో టెనెంట్స్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసే రౌండ్లు జరిగాయి. మొదటి రౌండ్ లో ఫ్లోరా ఔట్ కాగా, సంజనా స్వయంగా తప్పుకుంది. రెండో రౌండ్ లో సుమన్ శెట్టి, మూడో రౌండ్ లో రీతూ చౌదరీ, నాల్గో రౌండ్ లో తనూజ ఎలిమినేట్ అయ్యారు. ఈ రౌండ్లలో గట్టి పోటీ జరిగింది. ముఖ్యంగా రీతూ – తనూజ మధ్య పోరు కాస్త వివాదంగా మారింది. ఇమ్మాన్యుయెల్ కూడా బలంగా పోరాడినా, చివరికి రాము రాథోడ్ సైలెంట్ స్ట్రాటజీతో గెలిచి ఓనర్ గా నిలిచాడు. మొదట ఇమ్మాన్యుయెల్ కు అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ, చివరికి రామునే ఫైనల్ చేశారు. టాస్క్ సమయంలో రీతూ చౌదరీ వద్ద ఉన్న వస్తువులను ఇతరులు తీసుకోవడంతో ఆమె ఎమోషనల్ అయింది. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, ఫ్లోరా, సంజనా ఈ విషయంపై ఆమెతో వాదనకు దిగారు. చివరకు కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్ లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.
తనూజ మాత్రం తనపై కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. “అక్కా అక్కా అని పిలిచినా, సమయానికి ఎవరూ సహాయం చేయలేదు” అంటూ బాధపడ్డ ఆమె ఇకపై సెంటిమెంట్స్ పనిచేయవని స్పష్టం చేసింది. కొత్తగా ఓనర్ అయిన రాము గురించి ప్రియా ప్రశంసలు కురిపించింది. “సైలెంట్ గా ఆడిన నువ్వు చివరికి ఓనర్ అవ్వడం గ్రేట్” అని అభినందించింది. అదే సమయంలో రీతూ గురించి రాము బాంబ్ పేల్చాడు. “ఇద్దరం కలిసి ఆడదామని చెప్పినా, చివరికి నాకే ఎసరు పెట్టింది” అంటూ కామెంట్ చేశాడు. రీతూ చౌదరీ, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ లతో స్నేహంగా గడపడం చూసిన దమ్ము శ్రీజ “ఆమె గేమ్స్ ఆడటానికా? లేక వాళ్లతో ఉండటానికా?” అంటూ ప్రశ్నించింది. మరోవైపు ఇమ్మాన్యుయెల్ కూడా బిగ్ స్టోరీ రివీల్ చేశాడు. “రీతూ రాముని తన కంట్రోల్‌లోకి తీసుకుంది, అందుకే నేను త్యాగం చేశాను. కానీ ఆమెను ఇక ఫ్రెండ్ గా చూడడం లేదు” అని అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ తమ అసలు మైండ్ సెట్ బయటపెడుతూండడంతో ఈ రోజు టైము గడిచింది.
