టాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్లు అందించిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ తన సినీ మిత్రులతో కలిసి సందడి చేస్తుంటారు. తాజాగా ఆయన ఇంట్లో జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి అలీ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, కృష్ణవంశీ, కె. రాఘవేంద్రరావు, బీవీఎస్ రవి, రాజా రవీంద్ర, శివాజీ వంటి పేరుపొందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ, “30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థ్యాంక్యూ బండ్ల గణేష్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో… సీనియర్ సిటిజన్స్… కాదు కాదు, సీనియర్ యాక్టర్స్” అని ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలవుతున్నాయి. నెటిజన్ల నుండి భిన్నమైన కామెంట్లు, మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పాత తరం హీరోలు, దర్శకులు తరచూ రీ యూనియన్ పేరుతో కలుస్తూ అభిమానులని అలరిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ గెట్ టుగెదర్ కూడా అలాంటి వాతావరణాన్నే తలపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అందరూ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసినవారే.

- August 25, 2025
0
57
Less than a minute
You can share this post!
editor