యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్ తో యూత్ ను ఆకట్టుకున్న మౌళి తనూజ్, 1990లలో వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిందన్న వార్తలతో, మౌళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. అయితే ఈ సమయంలో బండ్ల గణేష్ పెట్టిన ఒక ట్వీట్, ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. బండ్ల గణేష్, ఇటీవల సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా సెలెబ్రిటీలకు విషెస్ చెబుతూ ఉండే గణేష్.. ఇప్పుడు మౌళిపై పెట్టిన ఓ పో స్ట్ తో వివాదంలో పడ్డారు. గణేష్ తన పో స్ట్ లో.. కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ.. చంపేశావు.. ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా మౌళిని మెచ్చుకున్నట్టే ఉన్నా గతంలోని ఓ రాజకీయ వివాదాన్ని చర్చకు తీసుకువచ్చినట్టు అయింది. దీంతో ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది. మౌళి నటుడిగా మారకముందు యూట్యూబ్ కామెడీ వీడియోలతో ఫేమ్ సంపాదించాడు. కానీ 2023లో, ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన జోక్ వైరల్ కావడంతో రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. అప్పట్లో వైసీపీ మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేయడంతో మౌళి తన మాటలపై బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

- September 8, 2025
0
52
Less than a minute
You can share this post!
editor