‘బకాసుర రెస్టారెంట్‌’ ట్రైల‌ర్

‘బకాసుర రెస్టారెంట్‌’ ట్రైల‌ర్

ప్రముఖ కమెడియన్‌లు ప్రవీణ్‌, వైవా హర్ష, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా నుండి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. విప‌రీతంగా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. హర్రర్ కామెడీ జానర్‌లో వ‌స్తున్న ఈ ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా హిలేరియ‌స్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. కృష్ణభగవాన్‌, ఉప్పెన జయకృష్ణ, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌. కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

editor

Related Articles