బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరోసారి చర్చల్లో నిలిచింది. ఇప్పటికే ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు సినిమాలను కలిపి రీ – రిలీజ్ చేయగా, అదే సందర్భంగా ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. థియేటర్లలో ‘బాహుబలి ది ఎపిక్’ ప్రదర్శన సందర్భంగా, కొత్త యానిమేషన్ సినిమా ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీజర్‌లో బాహుబలి చిన్ననాటి సన్నివేశాలు, శివగామి పెంపకం, బాహుబలి మరణం తర్వాత అతని ఆత్మ పైలోకాలకు వెళ్లడం, దేవతలు – రాక్షసుల మధ్య యుద్ధం, బాహుబలి ‘మంచి రాక్షసుడిగా’ చూపించబడడం వంటి సన్నివేశాలు కనిపించాయి. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రాజమౌళి ఇప్పటికే ఇంటర్వ్యూలో ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఇది బాహుబలి 3 కాదు. కానీ బాహుబలి కథకి కంటిన్యూషన్ ఉంటుంది.
 
											- October 31, 2025
				
										 0
															 33  
															  Less than a minute 
										
				
			You can share this post!
editor
				

 
											 
											