తమిళ కాంట్రవర్సీ సినిమా ‘బ్యాడ్ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేసింది. బ్రాహ్మణులను చెడుగా చూపించారనే ఆరోపణలతో ఈ సినిమా విడుదలకు ముందే వివాదాన్ని రేపింది. దీనికి ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. టీజర్‌తోనే చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ రొమాంటిక్ డ్రామా ‘బ్యాడ్ గర్ల్’ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 4న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వర్ష భరత్ అందించారు. ఆమెకు ఇది దర్శకురాలిగా తొలి చిత్రం. వర్ష ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ శిష్యురాలు. ‘బ్యాడ్ గర్ల్’ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్‌ను సాధించిన ఈ చిత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇందులో అంజలి శివరామన్ లీడ్ రోల్ పోషించారు. ఆమెకు డైరెక్టర్ వర్ష స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రంలో శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బ్యాడ్ గర్ల్’ సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి.
											- November 4, 2025
 
				
										 0
															 33  
															  Less than a minute 
										
				
			You can share this post!
editor
				
