బ్రెయిన్ స‌ర్జ‌రీ చేయించుకున్న అషూ రెడ్డి

బ్రెయిన్ స‌ర్జ‌రీ చేయించుకున్న అషూ రెడ్డి

బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అషూ రెడ్డి. కొన్నేళ్లపాటు యాంకర్‌గానూ రాణించిన ఈమె రామ్ గోపాల్ వ‌ర్మ‌తో ర‌చ్చ చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఛల్ మోహనరంగ, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, ఎ మాస్టర్ పీస్ వంటి సినిమాల‌లోను న‌టించి మెప్పించింది. అషూ రెడ్డి బ‌య‌ట‌కి కనిపించినంత హ్యాపీగా లేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అషూ రెడ్డి బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. తాను ఆ స‌మ‌యంలో ఎన్ని క‌ష్టాలు ప‌డిందో తెలియ‌జేసింది. హాస్పిటల్ బెడ్‌పై తీసిన ఫొటోలు, తలపై మెడికల్ బ్యాండేజీ, షేవ్ చేసిన హెయిర్ లైన్.. ఇవన్నీ ప్ర‌తి ఒక్క‌రినీ కదిలిస్తున్నాయి. నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా, ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అషూరెడ్డి త‌న పోస్ట్‌లో తెలియ‌జేసింది.

editor

Related Articles