యంగ్ హీరో ఆర్యన్ గౌర్ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. జాంబి, ఓ సాతియా వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు హ్యాట్రిక్ మూవీతో రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యాస్తమయం సమయంలో ఓ మహిళ వీల్ చెయిర్లో కూర్చుని ఉండగా, ఆమె పక్కన హీరో మరియు ఒక పెంపుడు కుక్కపిల్ల కనిపించే సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తోంది. ‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్.. వారి కథ’ అనే ట్యాగ్‌లైన్ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుండటం విశేషం. లక్ష్మీ నరసింహ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
- March 25, 2026
0
2
Less than a minute
You can share this post!
editor

