టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ అర్జున్ S/o వైజయంతి. ఈ సినిమా వచ్చే వారం (ఏప్రిల్ 18) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. అర్జున్ S/o వైజయంతి సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కళ్యాణ్ రామ్ టీం తిరుమలేశుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా.. వేద పండితులు చిత్రయూనిట్‌కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అభిమానులు ఆలయ ప్రాంగణంలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

- April 10, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor