అల్లు అర్జున్ సినిమా తప్ప మెగా హీరోలవి 8 ఫ్లాపులు..!

అల్లు అర్జున్ సినిమా తప్ప మెగా హీరోలవి 8 ఫ్లాపులు..!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌ లాంటి ఎనిమిది మంది హీరోలు ఉన్నారు. వీరి సినిమాలు ప్రతీ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ, ఇటీవల కాలంలో వీరి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటలేక‌పోతున్నాయి. అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2తో ఇండస్ట్రీ రేంజ్ హిట్‌ను అందుకున్నారు. మిగిలిన మెగా హీరోలతో పోలిస్తే ఆయన సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచి రూ.85 కోట్ల నష్టం మిగిల్చింది. పవన్ నుండి రాబోయే ఓజీపై మెగా అభిమానుల ఆశలు పెట్టున్నారు. రామ్‌చరణ్ సినిమా గేమ్ ఛేంజర్  సంక్రాంతికి విడుదలై భారీ హైప్ మధ్య రిలీజ్ అయినా, చివరకు దాదాపు రూ.100 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఉప్పెనతో మంచి హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన సినిమాలతో అదంత నిలబెట్టుకోలేకపోయాడు. ఆదికేశవ సినిమా పెద్దగా ఆడకపోవడంతో దాదాపు రూ.27 కోట్ల నష్టం మిగిల్చిందని సమాచారం. ఇలా గత రెండు సంవత్సరాల్లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన 8 సినిమాలు డిజాస్టర్‌గా నిలిచి, మొత్తంగా రూ.400 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చాయ‌ని అంటున్నారు. ప్రస్తుతం మెగా అభిమానులంతా మ‌రికొద్ది రోజుల‌లో విడుద‌ల కానున్న ఓజీ, విశ్వంభర, లాంటి సినిమాలపై చాలా గట్టి నమ్మకంతో హిట్ అవుతాయని నమ్ముతున్నారు.

editor

Related Articles