అనుష్కా శర్మ తిరిగి రాబోతుంది..?

అనుష్కా శర్మ తిరిగి రాబోతుంది..?

భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా 2025 వన్డే వరల్డ్ కప్‌ 47 ఏళ్ల తర్వాత గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళా క్రికెట్‌కి ఇది కొత్త యుగానికి నాంది అని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ట్రెండ్‌ మొదలైంది. క్రికెట్ ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు కలిసి ఒకే స్వరంలో ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు. మాజీ భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో అనుష్క శర్మ ప్రధాన పాత్ర పోషించారు. హీరోయిన్‌గా పేరుగాంచిన అనుష్క ఈ సినిమాకు కంబ్యాక్ ఇవ్వనున్నారు. ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ ట్రైలర్‌ విడుదలైనప్పుడే భారీగా వైరల్‌ అయింది. కానీ సినిమా అనౌన్స్‌చేసి మూడు ఏళ్లు అయింది. షూటింగ్‌ పూర్తిచేసి రెండు ఏళ్లు గడిచినా ఇప్పటివరకు విడుదల కాలేదు.

editor

Related Articles