భుజాలపై మూటలు మోసుకెళ్తున్న అనుష్క..

భుజాలపై మూటలు మోసుకెళ్తున్న అనుష్క..

టాలీవుడ్‌ హీరోయిన్ అనుష్కా శెట్టి  నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఘాటి. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా మేకర్స్‌ మ్యూజికల్‌ అప్‌డేట్ అందించారు. ఈ సినిమా నుండి సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. దస్సోరా సాంగ్‌ను ఆగస్ట్ 20న గ్రాండ్‌గా లాంచ్‌ చేయనున్నట్టు కొత్త లుక్‌ విడుదల చేశారు. విక్రమ్‌ ప్రభు, అనుష్క తమ భుజాలపై భారీ మూటలు మోస్తూ కొండలపై నుండి వస్తున్న లుక్ పాటపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటను నాగవెల్లి విద్యాసాగర్‌ కంపోజ్ చేశాడు. ఈ చిత్రంలో చైతన్య రావ్‌, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో నిరాశ చెందుతున్న అభిమానులు, ఫాలోయర్లు ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని అనుష్క టీంకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్‌ సూపర్ హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.

editor

Related Articles