Movie Muzz

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా ఓటీటీలోకి..

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా ఓటీటీలోకి..

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా ‘పరదా’ ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్ గా అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే, ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విడుదల సమయంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఫలితంగా నిర్మాతలు ఓటీటీలో త్వ‌రగా విడుద‌ల చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాకు ‘సినిమా బండి’, ‘శుభం’ ఫేం డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రల్లో నటించారు.

editor

Related Articles