శ‌ర్వానంద్‌తో రెండవసారి హీరోయిన్‌గా అనుప‌మ‌.!

శ‌ర్వానంద్‌తో  రెండవసారి  హీరోయిన్‌గా  అనుప‌మ‌.!

టాలీవుడ్ హీరో శర్వానంద్ త‌న కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. సంప‌త్ నంది ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. మరపురాని అనుభూతిని కలిగించే విధంగా ఈ సినిమా రాబోతోంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే సినిమా కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు శర్వానంద్. మే మొద‌టివారం నుండి షూటింగ్ శ‌ర‌వేగంగా ప్రారంభం కాబోతుండ‌గా.. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌  న‌టించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. గ‌తంలో శ‌ర్వానంద్, అనుప‌మ క‌లిసి శ‌త‌మానం భ‌వతి సినిమాలో న‌టించారు. దిల్‌రాజ్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మ‌ళ్లీ జ‌త క‌డుతుండ‌డంతో భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాకి కెమెరా: సౌందర్‌ రాజన్‌.ఎస్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

editor

Related Articles